Friday, January 24, 2025

‘రాజ్యాంగ హత్య దినం’గా జూన్ 25 ప్రకటనపై కాంగ్రెస్ విమర్శ

- Advertisement -
- Advertisement -

జూన్ 25ను ‘రాజ్యాంగ హత్య దినం’గా ప్రకటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ శుక్రవారం ఆక్షేపించింది. ప్రధాని నరేంద్ర మోడీ ‘కాపట్యంతో పతాక శీర్షిక రాబట్టేందుకు చేసిన మరొక విన్యాసం’గా కాంగ్రెస్ విమర్శించింది. 1975లో ఎమర్జన్సీ విధించిన రోజు జూన్ 25నే ‘రాజ్యాంగ హత్య దినం’గా పాటించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన తరువాత కాంగ్రెస్ ఆ విధంగా స్పందించింది. ఆత్యయిక స్థితిలో అమానుష వ్యథకు గురైన వారి ‘భారీ సేవలు’ గుర్తు పెట్టుకోవడానికి అమిత్ షా ‘రాజ్యాంగ హత్య దినం’ ప్రకటన చేశారు. ‘జీవ సంబంధంలేని ప్రధాని కాపట్యంతో పాల్పడిన మరొక పతాక శీర్షిక రాబట్టే విన్యాసం అది.

జూన్ 4న భారత ప్రజలు తనకు నిర్ణయాత్మక వ్యక్తిగత, రాజకీయ, నైతిక పరాజయం చేకూర్చడానికి ముందు పది సుదీర్ఘ సంవత్సరాల పాటు అప్రకటిత ఆత్యయిక స్థితిని ఆయన విధించారు. జూన్ 4 మోడీ ముక్తి దినంగా చరిత్రలో నిలచిపోతుంద’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ విమర్శించారు. ‘భారత రాజ్యాంగం, దాని సూత్రాలు, విలువలు, వ్యవస్థలపై పద్ధతిప్రకారం దాడి జరిపిన జీవ సంబంధం లేని ప్రధాని ఆయన’ అని రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘జీవ సంబంధం లేని ఆ ప్రధాని సైద్ధాంతిక కుటుంబం మనుస్మృతి నుంచి స్ఫూర్తి పొందలేదనే కారణంగా 1949 నవంబర్‌లో భారత రాజ్యాంగాన్ని తిరస్కరించింది. జీవ సంబంధం లేని ఆ ప్రధానికి ప్రజాస్వామ్యం అంటే ప్రజల గద్దె (డెమా కుర్సీ)’ అని రమేష్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News