న్యూఢిల్లీ: బీహార్ లో ఉన్న మిత్రపక్ష ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అవాకులు చెవాకులు పేలడాన్ని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. “అమిత్ షాకు పిచ్చెక్కింది. ఆయన ప్రభుత్వం బిహార్‌లో కూకటివేళ్లతో పెకిలించబడింది. ఇక 2024లో ఆయన పార్టీ(బిజెపి) కూడా కొట్టుకుపోతుంది. అందుకనే ఆయన ‘జంగిల్ రాజ్’ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. గుజరాత్‌లో ఉన్నప్పుడు ఆయన ఏమి చేశారు?” అని లాలూ యాదవ్ విలేకరులతో అన్నారు. “ఆయన గుజరాత్‌లో ఉన్నప్పుడు అక్కడ ఉండిందే జంగిల్ రాజ్” అని ఆరోపించారు. ‘అమిత్ షా బిల్‌కుల్ పాగల్ హో గయే” అని లాలూ విమర్శించారు.
“2024లో బీహార్‌లో బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆయన అంటున్నారు కదా..” అని ప్రశ్నించినప్పుడు “ చూద్దాం” అన్నారు. తన అధికార దాహం తీరాక నితీశ్ కుమార్ ఆర్జెడిని కూడా విడిచిపెడతారని బిజెపి అంటోందని అన్నప్పుడు, ప్రస్తుతానికైతే మేము కలిసి ఉన్నాం అన్నారు. ఇదిలావుండగా నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకోబోతున్నారు.
“మేము ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్నాం” అన్నారు. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. సోనియా గాంధీతో సమావేశం అయినప్పుడు ప్రతిపక్షాల ఐక్యతే తమ ఎజెండా కానుందన్నారు.
అమిత్ షాకు పిచ్చి పట్టింది: లాలూ
- Advertisement -
- Advertisement -
- Advertisement -