Monday, November 25, 2024

28 నుండి జంగల్ విఠోబా రథోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఈ నెల 28వ తేదీ నుండి జులై 6వ తేదీ వరకు ఉస్మాన్‌షాహీ విఠల్‌నగర్‌లోని చారిత్రాత్మక శ్రీ జంగల్ విఠోబా ఆలయ రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ ఛైర్మెన్, జిహెచ్‌ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శంకర్ యాదవ్, అధ్యక్షులు వుష్కెల కిష న్‌యాదవ్‌లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆలయకమిటీ ప్రతినిధులతో కలిసి విఠోబా ఆలయ ప్రాంగణంలో రథోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆ విష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆలయకమిటీ ఛైర్మెన్ జి శంకర్‌యాదవ్, అధ్యక్షులు వి కిషన్‌యాదవ్, ప్రధాన కా ర్యదర్శి పి మాణిక్‌రావు, కోశాధికారి వుష్కెల పాండుయాదవ్, ఆలయ అర్చకులు రాజు మహరాజ్, ఉపాధ్యక్షులు బోయిని వెంకటేష్ యాదవ్‌లు మా ట్లాడుతూ ఆలయకమిటీ ఆధ్వర్యంలో ప్రతీ యేటా మాదిరిగానే ఈ యేడాది సైతం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆలయ రథోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆషాడమాసం ఏకాదశి పర్వదిన సందర్బంగా ఈ నెల 29న గురు వారం శేష వాహనంపై శ్రీవిఠలేశ్వర స్వామివారిని అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు విఠోబా ఆలయం నుండి రథోత్సవం ప్రారంభమై ఉస్మాన్‌షాహీ, అఫ్జల్‌గంజ్ లైబ్రరీ, అఫ్జల్‌గంజ్ పాత పోలీస్‌స్టేషన్, మున్నాలాల్ దవాసాజ్, అశోక్‌బజార్, గౌ లిగూడ ఛమన్, గౌలిగూడ పాత బస్‌డిపో మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుందని వెల్లడించారు. 28వ తేదీ తెల్లవారుజామున స్వామివారికి పం చామృత అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై, స్వస్తి పుణ్యహ వాచనం, ధ్వజారోహణ, గోపూజ, కలశ స్థాపన, అఖండ దీపారాధన, స్వామి వారికి మహానైవేద్యం, హారతి, అనంతరం భక్తులకు తీర్ద, ప్రసాద వితర ణ, రాత్రి 7 గంటలకు పల్లకీసేవ, ఊంజల్ సేవ, హారతి, అష్టావధాన సేవ, భ జన, ఏకాంతసేవల తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆలయ రథోత్సవ వేడుకలు పూర్తయ్యే వరకు విఠోబా ఆలయంలో ప్రతి రోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న వేలాదిమంది భక్తజనుల సమక్షంలో అత్యంత వైభవోపేతం గా నిర్వహించే శ్రీ విఠలేశ్వరస్వామి వారి రథోత్సవానికి ఆధ్యాత్మిక. రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, పలు ఆలయ కమిటీల ఛైర్మెన్‌లతో పా టు వివిధ శాఖల అధికారులు, సంఘసేవకులు హాజరుకానున్నట్లు తెలిపారు. జులై 6న ఉదయం 9 గంటలకు విఠోబా ఆలయం నుండి గరుడ వాహ నంపై పాండురంగ స్వామి ఊరేగింపు ప్రారంభమై ఇమ్లీబన్ జగన్నాధస్వామి మఠం వరకు కొనసాగుతుందని, స్వామివారికి చక్రస్నానం అనంతరం భక్తులకు తీర్ద, ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ పూజా కార్యక్రమంలో ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారు రఘునందన్ యాదవ్, విజయ్‌కుమార్, కట్ట మల్లేశం, రాంశెట్టి నరేందర్ , వెంకటరమణ, ప్రకాష్‌చారి, రాంచందర్, గోపీ యాదవ్, వి గణేష్ యాదవ్, జనార్దన్, శ్రీకాంత్ గౌడ్, విశాల్ గలిబె, మధుసూదన్ న్, కిరణ్‌గుప్తా, కట్ట రమేష్‌ముదిరాజ్, ఎస్ ఆనంద్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News