Friday, December 20, 2024

జూన్ 1 నుండి తెరుచుకోనున్న జూనియర్ కాలేజీలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు జూన్ 1 నుండి పున: ప్రారంభం కానున్నారు. జూనియర్ కాలేజీలకు మే 31తో వేసవి సెలవులు ముగుస్తున్నాయని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటలో తెలిపారు. జూనియర్ కాలేజీలు జూన్ ఒకటి నుండి తెరుచుకుంటున్న విషయాన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు తెలిపింది. 202425 విద్యా సంవత్సరం జూన్ 1 నుండి ప్రారంభమవుతోందని, అకడమిక్ క్యాలెండర్‌ను ఖచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News