Tuesday, December 24, 2024

22 నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. స్టైఫండ్ సకాలంలో రావడం లేదని జూడాలు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సోమవారం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డిఎంఇ డాక్టర్ వాణికి సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ స్టైఫండ్ సమస్య నెలకొన్నదని జూడా అధ్యక్షులు సీహెచ్ జీ సాయిశ్రీ హర్ష పేర్కొన్నారు. తమకు రెండు నెలల నుంచి స్టైఫండ్ అందడం లేదని, ప్రతి నెల ఇదే సమస్య వస్తుందని అన్నారు. ప్రతి నెల 15 వరకు స్టైఫండ్‌ను అందజేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చెప్పారు.

ప్రతినెలా సకాలంలో స్టైఫండ్ అందేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఎలా అమలు చేస్తారనే అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఎపిలో జిఒ 36 ద్వారా కేవలం రెండు మూడు రోజుల్లోనే స్టైఫండ్‌కు నిధులు మంజూరు చేస్తున్నారని, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే సమ్మె చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పెరిగిన వైద్య విద్యార్ధులకు అనుగుణంగా యుజి, పిజి హాస్టళ్ల సౌకర్యాలను పెంచడంతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News