Monday, December 23, 2024

ఫలించని చర్చలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు సోమవారం బోధనాసుపత్రుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జూనియర్ డాక్టర్లతో వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం చర్చలు నిర్వహించారు. అయితే, ఈ చ ర్చలు అంసపూర్తిగా ముగిశాయని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని ప్రతిపాదనలపై మం త్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని ప్రతిపాదనలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డాక్టర్ల భద్రత గురించి ఆలోచిస్తామని, స్టైఫండ్‌కు గ్రీన్ ఛానల్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి చెప్పినట్లు జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. సమ్మె కొనసాగింపుపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News