Wednesday, January 22, 2025

రాష్ట్రపతి, ప్రధానికి బెంగాల్ జూడాల వినతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రతిష్టంభనపై జోక్యం చేసుకోవలసిందని అభ్యర్తిస్తూ పశ్చిమ బెంగాల్‌లో నిరసనకారులైన జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నాలుగు పేజీల లేఖ ప్రతులను పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల ఫ్రంట్ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌కు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాకు కూడా పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆగస్టు 9న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ హత్యాచారానికి గురైన విషయం విదితమే. జూనియర్ డాక్టర్లు అప్పటి నుంచి ‘సమ్మె చేస్తున్నారు’.

‘అత్యంత హీనమైన నేరానికి గురైన దురదృష్టవంతురాలైన మా సహచరికి న్యాయం లభించడానికి, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ కింద ఆరోగ్య సేవల వృత్తి నిపుణలమైన మేము ఎటువంటి భయాందోళనలూ లేకుండా ప్రజల కోసం మా విధులు నిర్వర్తించగలిగడానికి వీలు కల్పిస్తూ గౌరవనీయులైన ప్రభుత్వ అధిపతుల ముందు మా సమస్యలను వినయపూర్వకంగా ఉంచుతున్నాం. ఈ జటిల సమయంల మీ జోక్యం మా అందరికీ ఆశాకిరరమై మమ్మల్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకువస్తుందని ఆశిస్తున్నాం’ అని వారు రాశారు. లేఖను ఈ నెల ఆరంభంలోనే రాసినట్లు, గురువారం రాత్రి పంపినట్లు నిరసనకారులైన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో ‘పిటిఐ’తో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News