Wednesday, January 29, 2025

ప్రజాభవన్‌లో జూనియర్ లెక్చరర్ల ధర్నా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తమకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వండని జూనియర్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో జూనియర్ లెక్షరర్ల అభ్యర్థులు సోమవారం ధర్నా చేపట్టారు. 1392 మంది టిజిపిఎస్‌సి జూనియర్ లెక్షరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జులై నెలలో ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టిజిపిఎస్‌సి విడుదల చేసింది. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో పిడబ్లూడి అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఈ క్రమంలో గత అక్టోబర్‌లో ఫైనల్ ఫలితాలను ప్రకటించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News