Wednesday, January 22, 2025

భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

జపాన్ లో భూకంపం సంభవించడంపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం జపాన్ లోనే పర్యటించిన ఎన్టీఆర్ సోమవారమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తాను ఎక్కడ పర్యటించానో అదే ప్రాంతంలో భూకంపం రావడంపై ఆయన స్పందిస్తూ ‘గత వారం అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలి’ అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

కొత్త సంవత్సరం రోజున జపాన్ ప్రజలను వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేశాయి. దాదాపు 21సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. జననష్టం అంతగా లేకపోయినా ఆస్తినష్టం మాత్రం భారీయెత్తున జరిగింది. వరుస భూకంపాలు రావడంతో జపాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందారు. సముద్రతీర ప్రాంత ప్రజలు పొట్ట చేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News