- Advertisement -
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని వైసిపి నేత లక్ష్మీ పార్వతి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలవడంపై రాజకీయంగా ఊహాగానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టనున్న జూనియర్ ఎన్టీఆర్ కు తాను హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు.
- Advertisement -