Wednesday, January 22, 2025

కర్ణాటక అసెంబ్లీలో రాజ్యోత్సవ కార్యక్రమానికి జూ. ఎన్టీ ఆర్

- Advertisement -
- Advertisement -

Jr NTR

హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరగనున్న కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయం శనివారం  ధ్రువీకరించింది. ఈ కార్యక్రమంలో ఇటీవలే మరణించిన పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక సర్కారు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డును అందజేయనుంది. ఈ వేడుకకు రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ను బసవరాజ్ బొమ్మై ఆహ్వానించగా, అందుకు జూనియర్ ఎన్టీఆర్ సమ్మతించారు.

ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పునీత్ రాజ్ కుమార్ కుటుంబం కూడా హాజరు కానుంది. పునీత్ రాజ్ కుమార్ తో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్నేహమే ఉన్న సంగతి తెలిసిందే. పునీత్ మరణించిన సందర్భంగా ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పునీత్ కు అవార్డు ఇస్తున్న కార్యక్రమానికి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలగిన ప్రముఖులను ఆహ్వానించాలని కర్ణాటక సర్కారు భావించి, జూ.ఎన్టీఆర్ ను ఈ వేడుకకు ఆహ్వానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News