Thursday, January 23, 2025

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఖానాపురం : మండలంలోని రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బైరి సోని(29) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం విధుల్లోకి హాజరైన అనంతరం పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం వెంటనే సోనిని నర్సంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

నర్సంపేటలో ఉండే సోనికి ఒక పాప ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి సోని మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News