- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె మూడో రోజు కొనసాగింది. వివిధ జిల్లా, మండల కేంద్రాల్లో జూనియర్ కార్యదర్శుల సమ్మెకు మద్దతుగా వివిధ పార్టీల నేతలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించి.. మద్దతు పలికారు. హుజురాబాద్ ఎంపిడిఓ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధర్నాలో కూర్చున్నారు.
Also Read:మాస్టర్‌కార్డ్, ఎం1ఎక్సేంజ్ మధ్య డీల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అదే విధంగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో సమ్మెలో పాల్గొన్న జూనియర్ కార్యదర్శులు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు.
- Advertisement -