Wednesday, January 22, 2025

జూనియర్ బాక్సింగ్‌లో భారత్ హవా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్మేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్‌కు మరో ఐదు పతకాలు ఖాయమయ్యాయి. ఐదుగురు బాక్సర్లు సెమీ ఫైనల్‌కు చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మహిళల 52 కిలోల విభాగంలో ఆసియా జూనియర్ ఛాంపియన్ నిషా, 70 కిలోల విభాగంలో ఆకాంక్షలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.

దీంతో వీరు కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. 75 కిలోల విభాగంలో కీర్తికా,57 కిలోల విభాగంలో వినీలు విజయం సాధించారు. పురుషుల విభాగంలో హేమంత్ సంగ్వాన్ (80 కిలోలు), సికందర్ (48 కిలోలు) సెమీ ఫైనల్‌కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన 17 మంది బాక్సర్లు సెమీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నారు. ఇందులో 12 మంది మహిళా బాక్సర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News