Sunday, January 19, 2025

తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం: జూపల్లి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేశారని జూపల్లి కృష్ణా రావు తెలిపారు. 2014 ముందు పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నామని, తెలంగాణ వచ్చాక తమ అంచనాలన్నీ తప్పాగా మారాయన్నారు. సిఎం కెసిఆర్ పాలనంతా బోగస్ మాటలు, పథకాలతో సాగుతోందని, ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మికులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉండవద్దని సిఎం కెసిఆర్ భావిస్తున్నారని, కెసిఆర్ తీరు అంబేడ్కర్‌ను అవమానించేలా ఉందన్నారు.

Also Read: రైతుల పక్షపాతి సిఎం కెసిఆర్

దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ నియంతృత్వ ధోరణి పరాకాష్టకు చేరిందని, మంత్రులనూ కెసిఆర్ మనుషులుగా చూడలేని పరిస్థితి లేదన్నారు. ఈ సారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వకపోతే దేవుడు కూడా క్షమించారన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే నెల 14 లేదా 16న రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News