Monday, December 23, 2024

ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః కర్ణాటక ఎన్నిక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. దీంతో గతంలో పార్టీ వీడిన వారందరూ తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పలువురు లీడర్లు పార్టీలో చేరబోతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వీరిద్దరినీ కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టమైంది.

ఆదివారం జూపల్లి కృష్ణారావు, రాహుల్ గాంధీని కలిసి చర్చించేందుకు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో పార్టీలో చేరికలపై చర్చించేందుకు కాంగ్రెస్ హైకమండ్ మహబూబ్ నగర్, ఖమ్మ పార్టీ సీనియర్లను ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News