Tuesday, November 5, 2024

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు..

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్: కొల్లాపూర్ రాజకీయాలు రోజురోజుకో మలుపు తిరుగుతూ ఆది నుంచి నేటి వరకు వాడీవేడీగా ఉన్న రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న నాటికి రసవత్తరంగా మారుతున్నాయి. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును బిఆర్‌ఎస్ నుంచి సంస్పెండ్ చేయగా బిజేపిలో, కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెల్లడవుతున్న తరుణంలో మాజీమంత్రి జూపల్లి కాంగ్రేస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు తనకే టికెట్ వస్తుందని చెప్పుకొస్తున్న కాంగ్రెస్ టిపిసిసి సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్‌రావుకు, టిపిసిసి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావులకు పోటీ మొదలైనట్టయ్యింది. దీంతో అదిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్న సందిగ్దం కాంగ్రెస్‌లో నెలకొంది.

ఇక బిఆర్‌ఎస్‌లో ఎమ్మేల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి లైన్ క్లియర్ ఆయ్యిందనుకుంటున్న తరుణంలో తానూ పోటీలో ఉన్నానంటూ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించడంతో బిఆర్‌ఎస్‌లో, అటు కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి కొనసాగుతుండగా కార్యకర్తల్లో, ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. బిజెపిలో మాజిమంత్రి జూపల్లి చేరకపోవడంతో బిజెపి టికెట్‌పై ఉన్న ఉత్కంటతకు తెరపడింది. కొల్లాపూర్ రాజకీయాలు ఆది నుంచి ఎన్నికల వేడిని తలపించే విధంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి మాజిమంత్రి జూపల్లి కృష్ణారవు ఓడిపోవడంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మేల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి టిఆర్‌ఎస్‌లో ఇద్దరి మద్య పోటీ పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి బలాబలాలు వారు చూపిస్తూ వచ్చారు.

అనూహ్య పరినామాల నేపద్యంలో బిఆర్‌ఎస్ అధిష్టానం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సంస్పెండ్ చేసింది. దీంతో బిఆర్‌ఎస్‌లో ఎమ్మేల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి లైన్ క్లియర్ అయ్యిందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో తాను బిఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నాను అంటూ గతంలో టిఆర్‌ఎస్(బిఆర్‌ఎస్) నుంచి పోటీ చేసి ఓబిపోయిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెరపైకి వచ్చారు. అయితే అధిష్టానం ఎమ్మేల్యే బీరంకే టికెట్ ఇస్తుందని ఆ దిశగా హామీ కూడా ఇచ్చిందని పార్టీ వర్గాలు, ఎమ్మేల్యే అనుచరులు చెప్పుకుంటున్నారు. ఏది ఎమైనప్పటికీ అధికార పార్టీలో ఆశావాహులు టికెట్ ఆశిస్తుండడంతో గందరగోళం నెలకొంది.

కాంగ్రెస్ టికెట్ సందిగ్దం, కార్యకర్తల్లో అయోమయం
కొల్లాపూర్ కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఇదిలా ఉండగా బిఆర్‌ఎస్ బహిషృత నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు బిజెపిలో, కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వాళ్లు పెరగుతున్నారు. టిపిసిసి సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు టికెట్ ఆశించి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. పార్టీ పెద్దలు తనకే టికెట్ ఇస్తారన్న హామీతో ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ జగదీశ్వర్‌రావు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లారు. అలాగే టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్‌రావు కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా మరికొందరు పార్టీ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడంతో పార్టీ ఆశిస్తున్న వారిలో సందిగ్దత నెలకొంది. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసి కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ నడిపించిన తమకే పార్టీ టికెట్ ఇవ్వలంటూ కార్యకర్తలు, నాయకులు బహిరంగంగానే విమర్షలకు ఎక్కు పెట్టారు.

రోజురోజుకు మారుతున్న సమీకరణలతో రోజుకోమలుపు తిరుగుతూండగంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ చింతలపల్లి జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వలంటూ కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. ఇక రంగినేని అభిలాష్‌రావు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. జూలై 14 లేదా 20న కొల్లాపూర్ సభలో కాంగ్రేస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరనున్నారు. దీంతో పార్టీ టికెట్ ఆశించిన వారికి భంగపాటు తప్పదా అన్న ప్రశ్న కార్యకర్తల్లో నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ టికెట్ ఇస్తే ఇప్పటి వరకు టికెట్ ఆశించిన వారు పార్టీ ఆదేశాలను పాటీస్తారా లేదా అన్నది ఇస్తారో వేచి చూడాల్సిందే.

బిజెపి టికెట్‌కు లైన్ క్లియరైనట్టెనా..
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచి బరిలో నిలిచి ఓడిన ఎల్లేని సుధాకర్‌రావుకు పార్టీ టికెట్ లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పొచ్చు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్నాళ్లు బిజెపిలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలతో పార్టీలో, కార్యకర్తల్లో ఉన్న ఉత్కంటతకు ఎట్టకేలకు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో తెరపడింది. ఇప్పటికే పాదయాత్రలు చేసిన ఎల్లేని బిజేపి జిల్లా అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. కార్యకర్తలతో కలిసి పార్టీ పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ సారి టిడిపి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పగిడాల శ్రీనివాస్ అంటున్నారు. ఆ దిశగా పార్టీ, స్వంత ఇమేజ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో కొల్లాపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇన్నాళ్లు ఎమ్మేల్యే, మాజీమంత్రి మద్యే పోటీ అంటూ ఊహాగానాలు, సోషల్ మీడియాల్లో వస్తుండగా రానున్న పరినామాల దృశ్య పోటీ ఎలా ఉంటుందన్నదాన్ని ఓటర్లే నిర్ణిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News