Thursday, December 19, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు..

- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో గురువారం ఉదయం ఎఐసిసి అధ్యక్షుడు మల్లీఖార్జున ఖర్గే, జూపల్లి కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. జూపల్లితోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, పలువురు ముఖ్య నాయకులు మల్లీఖార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లి కృష్ణారావు భావించారు. అయితే, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రియాంక గాంధీ సభ వాయిదా పడడంతో ఈరోజు ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ జాయిన్ అయ్యారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News