Saturday, February 22, 2025

ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

సిరికొండ : దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వాల్గోట్ లో జూపల్లి కృష్ణారావు గురువారం పర్యటిస్తున్నారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి పరిశీలిస్తున్నారు. ప్రతి రైతును ఆదుకుంటాం, ఆధైర్య పడవద్దని సూచించారు. రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు. గత పదేళ్లలో కెసిఆర్ ఏనాడూ రైతులను ఆదోకోలేదని జూపల్లి ఆరోపించారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తామన్నారు. కెసిఆర్ పాలనలో విత్తనాలకు సబ్సిడీ ఇవ్వలేదని ఆరోపించిన జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News