Monday, December 23, 2024

బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్: కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన శివ శంకర్ మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం శివ శంకర్‌ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కొల్లాపూర్ పట్టణానికి చెందిన గిరిధర్ వెన్నముక సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామానికి చెందిన శివలీల, రాములు దంపతులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని వారిని కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మనోధైర్యాన్ని కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News