Friday, December 20, 2024

జూరాల ఐదు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి నీటిని అధికారులు వదిలారు. జూరాల రిజర్వాయర్ నుంచి స్పిల్ వే ద్వారా 19,615 వేల క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 37వేల 250 క్యూసెక్కుల చొప్పున 56, 865 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదిలారు. తెలంగాణలో గత రాత్రి నుంచి భారీ  వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, కుమ్రంబీం ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి.

ఇన్ ఫ్లో : 70,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 56,865 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు
ప్రస్తుత నీటి సామర్థ్యం: 317.420 మీటర్లు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టిఎంసి
ప్రస్తుత నీటి నిల్వ : 7.498 టిఎంసి

ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News