- Advertisement -
నాగర్ కర్నూల్: ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాంకు 1,25,000 క్యూసేక్కుల భారీ వరద నమోదు కాగా, ఇది గురువారం 11 గంటల వరకు 1,50,000 క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు సూచించారు. దిగువన ఉన్న అలమట్టి, జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపూర్ డ్యాం అధికారులు ప్రకటన జారీ చేశారు.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 33 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో గురువారం జూరాల ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 2 వేల77 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 22 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజీకి 1250 క్యూసెక్కుల స్వల్ప వరద కొనసాగుతుంది.
- Advertisement -