ఎగువ రాష్ట్రాల్లో కృష్ణానది పరివాహకంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో అల్మట్టి , నారాయణపూర్ జలాశయాలు గరిష్ట స్థాయికి చేరి నిండుకుండలను తలపిస్తున్నాయి. వరదనీటిని సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగువ నుంచి వచ్చే 46195క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాలను దృష్టిలో పెట్టుకుని గురువారం నాడు జారాల ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసింది. దీంతో జూరాల నుంచి 30,013క్యూసెక్కుల వరద దిగువన శ్రీశైలం జలాశయం దిశగా పరుగులు పెడుతోంది. అల్మట్టి నుంచి 65వేలక్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా వదర ప్రవాహాం భారీగా పెరిగింది.ఎగువ నుంచి 1,12,221క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 50.82టిఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 7186క్యూసెక్కుల నీరు చేరుతుండగా , దిగువన తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 20557క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
సీతమ్మసాగర్‌కు రూ164314క్యూసెక్కులు
గోదావరి నదిలో వరద ప్రవాహాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎగువ నుంచి శ్రీరాం సాగర్‌కు 20833క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2479క్యూసెక్కులు చేరుతోంది. తుపాకుల గూడెం వద్ద సమక్కసాగర్‌కు 238250క్యూసెక్కులు చేరుతుండగా, సీతమ్మ సాగర్‌కు 164314క్యూసెక్కుల వరద చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు.