- Advertisement -
జస్టిస్ భూషణ్ రామ్‌కృష్ణ గవాయి మంగళవారం తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా నియుక్తుడయ్యారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ మరునాడు మే 14న ఆయన సిజెఐ కార్యాలయంలోకి ప్రవేశిస్తారు, జస్టిస్ గవాయిన 52వ సిజెఐగా నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. నిర్దేశిత ప్రక్రియ ప్రకారం, జస్టిస్ గవాయి పేరును సిజెఐ ఖన్నా ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాగా, జస్టిస్ గవాయి ఆరు నెలలే సిజెఐ పదవిలో ఉంటారు. 65 ఏళ్ల వయస్సు రాగానే ఆయన డిసెంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. ఆయన సిజెఐ ఖన్నా తరువాత సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి.
- Advertisement -