Friday, January 24, 2025

న్యాయం ఆలస్యం కావడం ప్రధాన సమస్య

- Advertisement -
- Advertisement -

Justice delayed is the main problem:Modi

సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా
ప్రాంతీయ భాషల్లో చట్టాలను రూపొందించాలి
అఖిల భారత న్యాయశాఖ మంత్రుల సదస్సులో ప్రధాని సందేశం

కేవాడియా : న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన దేశానికి, సామరస్యపూర్వకమైన సమాజానికి సున్నితమైన న్యాయవ్యవస్థ అత్యవసరమని ఆయన అన్నారు. చట్ంటలో అస్పష్టత సంక్లిష్టతను సృష్టిస్తుందని, అందువల్ల పేదప్రజలు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా ‘ఈజ్ ఆఫ్ జస్టిస్’ను తీసుకురావడం కోసం తేలిగ్గా అర్థమయ్యే విధంగా ప్రాంతీయ భాషల్లో కొత్త చట్టాలను రాయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయపరమైన భాష పౌరులకు ఒక అడ్డంకిగా మారకూడదని కూడా ఆయన అన్నారు. గుజరాత్‌లోని కేవాడియా జిల్లాలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి దగ్గర్లో ఉన్న ఏక్తానగర్‌లో రెండు రోజలు పాటు జరిగే న్యాయశాఖ మంత్రులు, న్యాయ కార్యదర్శుల అఖిల భారత సదస్సును శనివారం ప్రధాని వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం 1500కు పైగా పాతపడిన కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసిందని, వీటిలో అధిక భాగం బ్రిటీష్ పాలన కాలంనుంచి కొనసాగుతున్నవి ఉన్నాయని ఆయన చెప్పారు.

న్యాయాన్ని పొందడంలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని అంటూ.. అయితే ఈ సమస్యను పరిష్కరించే దిశగా మన న్యాయవ్యవస్థ సీరియస్‌గా కృషి చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ఈ అమృత్ కాల్‌లో ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, లోక్ అదాలత్‌లు లాంటి వ్యవస్థలు కోర్టులపై రాన్ని తగ్గిచడానికి, ప్రజలు సులువుగా న్యాయం పొందడానికి తోడ్పడ్డాయని కూడా ప్రధాని అన్నారు. న్యాయవ్యవస్థలో ప్రాంతీయభాషలను ఉపయోగించాలని ప్రధాని గట్టిగా కోరుతూ ‘ ఈజ్ ఆఫ్ జస్టిస్’ విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ‘ చట్టాలు అస్పష్టంగా ఉండడం సంక్లిష్టతను సృష్టిస్తుంది. చట్టం గనుక సామాన్యుడికి సమగ్రంగా అర్థమయ్యే విధంగా ఉన్నప్పుడు అది ఎంతో ప్రభావం చూపిస్తుంది’ అని మోడీ అన్నారు. కొన్ని దేశాల్లో చట్టాన్ని రూపొందించినప్పుడు దాన్ని రెండు మార్గాల్లో నిర్ణయిస్తారు.

సాంకేతిక పరిభాషను ఉపయోగించి దానిలోని చట్టపరమైన నిబంధనలకు వివరణాత్మక వివరణ ఇవ్వడం అందులో ఒకటి కాగా, సామాన్యుడు కూడా అర్థం చేసుకోవడం కోసం దాన్ని ప్రాంతీయ భాషలో రాయడం మరోటని ఆయన అన్నారు. అందువల్ల చట్టాన్ని రూపొందించేటప్పుడు కొత్త చట్టాన్ని పేదలు కూడా అర్థం చేసుకునేలా ఉండడంపై మన దృష్టి ఉండాలన్నారు. అలా ఒక విధంగా చట్టాన్ని రూపొందించినప్పుడే దాని వయసు, కాలం చెల్లే తేదీ రెండూ కూడా నిర్ధారణ అవుతాయి. నిర్దేశించిన తేదీ వచ్చినప్పుడు కొత్త పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సమీక్షిస్తారు. మన దేశంలో కూడా మనం అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మోడీ అన్నారు.

న్యాయ వ్యవస్థలో స్థానిక భాషలను ఉసయోగించే విషయాన్ని తాను కొంతకాలంగా న్యాయవ్యవస్థ ముందు లేవనెత్తుతున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ దిశగా దేశం చాలా పెద్ద కృషి చేస్తోందన్నారు. అలాగే యువతకోసం మాతృభాషలో న్యాయవిద్యావ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమర్థవంతమైన దేశం, సామరస్య పూర్వకమైన సమాజానికి సున్నితమైన న్యాయవ్యవస్థ అత్యవసరమని మోడీ అంటూ రాజ్యాగంలోని మూడు స్తంభాలయిన న్యాయవ్యవస్థ, చట్టసభలు, ఎగ్జిక్యూటివ్ ఒకదానితో మరోటి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News