Monday, December 23, 2024

ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్. జగన్ పాల్గోన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్, సిఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డిజిపి కె వి రాజేంద్రనాథ్రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌కి సిఎం వైఎస్.జగన్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News