Thursday, January 23, 2025

సుప్రీం కోర్టు జడ్జీగా జస్టిస్ దీపాంకర్ దత్తా

- Advertisement -
- Advertisement -

Justice Dipankar Datta as Supreme Court judge

న్యూఢిల్లీ : బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తాకు పదోన్నతి కల్పించారు. సుప్రీం కోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్ 26 న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ దత్తాను 2020 ఏప్రిల్‌లో నియమించారు. కోల్‌కతా హైకోర్టు మాజీ జస్టిస్ సలిల్ కుమార్ దత్తా కుమారుడైన జస్టిస్ దత్తా 1965లో జన్మించారు. 1989 లో కోల్‌కతా వర్శిటీ నుంచి దీపాంకర్ ఎల్‌ఎల్‌బి డిగ్రీ పూర్తి చేశారు. రాజ్యాంగం, సివిల్ అంశాల్లో సుప్రీం కోర్టుతోపాటు హైకోర్టుల్లో ఆయన ప్రాక్టీస్ చేశారు. 2006 లో కోల్‌కతా హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News