Monday, December 23, 2024

హస్తంలో బిసిల లొల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సరికొత్త లొల్లి మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గాల కులాలకు చెందిన నా =యకులకు సగభాగం సీట్లివ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అందుకు తగినట్లుగా అధినాయకుల సమావేశాలు, చర్చ లు, గ్రూపు మీటింగ్‌లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లు… రెడ్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే ధోరణితో ఎన్నికల తతంగం జరుగుతోందని, అలా కాకుండా పార్టీలో అన్ని వ ర్గాలకు సముచితమైన స్థానం, గుర్తింపు, గౌరవం ఇవ్వాలని డిమాండ్లు పెరిగాయి. ఎంఎల్‌ఎ, ఎం పి పదవులకు రెడ్డి కులస్థులనే పోటీలో నిలుపుతూ మిగతా కులాలను ఓటు బ్యాంకులుగా మాత్రమే వాడుకుంటూ దశాబ్దాల చేసిన రాజకీయాలకు చరమగీతం పాడాలని నేతలు గట్టిగా వాది స్తూ పార్టీలోని సీనియర్లు, జూనియర్ బిసినేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతోంది. అందులో భా గంగానే బుధవారం కొందరు బిసి నాయకులు మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లతో భేటీ అయ్యారు.

రానున్న అ సెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌కు జరగబోయే ఎన్నికల్లో సైతం బిసి నేతలకు 50 శాతం సీట్లివ్వాలని, ఆ మేరకు రాష్ట్ర పిసిసిపై తేవడమే కాకుం డా.. ఎఐసిసి పెద్దలను కూడా ఒప్పించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇదే అంశంపై మొదట్నుంచీ కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూ డా అనేక దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారని, ఎఐసిసిలో కూడా మంచి పలుకుబడి ఉన్న వి హెచ్‌ను ఈ లక్ష సాధన కార్యక్రమాలకు సారథ్యం వహించాలని కూడా నేతలు కోరుతున్నారు. అలాకాని పక్షంలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యనైనా బిసిలకు న్యాయం చేయించే బాధ్యతను స్వీకరించాలని కూడా నేతలు కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్ తదితరులు ఆయనను విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఎఐసిసి అగ్రనేతలతో గా మేడమ్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలను సైతం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కన్విన్స్ చేయగలరని, అం దుకే పొన్నాలను అభ్యర్థ్ధించామని ఆ నాయకులు కొందరు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని మొ త్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 44 నుంచి 50 అసెంబ్లీ స్థానాల్లో బిసీ జనాభా, బిసీ ఓటర్లు పార్టీలను గెలిపించుకునే స్థాయిలో ఉన్నారని, పా ర్టీలో కూడా అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పనిచేస్తున్న బిసీ నేతలు కూడా తగిన సంఖ్యలోనే ఉన్నారని అంటున్నారు. గణాంకాల కోసం బీసీలకు సీట్లిచ్చామని చెప్పుకోవడానికి కాకుండా నిజాయితీగా అసెంబ్లీలో బీసీలు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టే విధంగా సీట్ల కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. అలా కాకుండా హైదరాబాద్ నగరంలోని చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, సిద్దిపేట్, గజ్వేల్ వంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో బీసీలకు టిక్కెట్లు ఇచ్చి లెక్కలు వేసుకుంటే సరిపోదని, ఇంకా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని, వాటిల్లో బిసీ ఓటర్లు, జనాభా ఎక్కువగా ఉన్నవి 50 సీట్లు ఉన్నాయని, వాటిల్లో బిసీ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని, ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలనే కాకుండా ఎఐసిసి పెద్దలను ఒప్పించాలని కూడా ఆ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌లను కోరినట్లుగా తెలిసింది.

ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చలు జరిపారని, అందులో భాగంగా గెలుపు, ఓటములనేవి కేవలం బీసీలకే పరిమితం కాదని, రెడ్లు కూడా ఓటమి చెందారనే విషయాన్ని టి.పిసిసి నాయకులు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అంతెందుకు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోలేదా? రెడ్లు ఓడిపోతే లెక్కలోకి తీసుకోరా? కేవలం బిసీలు ఓడిపోతేనే లెక్కలోకి తీసుకొని “బీసీలకు సీట్లిస్తే ఓడిపోతున్నారుగా…” అని వ్యాఖ్యానించి బిసీ నేతలను పక్కనబెట్టడం సబబుకాదని అంటున్నారు. బీసీలకు సీట్లివ్వాలనే డిమాండ్ రాగానే హైదరాబాద్ పాతబస్తీలోని నియోజకవర్గాలే పిసిసి నేతలకు గుర్తుకు వస్తున్నాయని, ఇదెక్కడి న్యాయమో అర్ధంకావడంలేదని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల్లో బీసీలే కాకుండా రెడ్లు, బ్రాహ్మణులు, వెలమ, కమ్మ తదితర అగ్రకులాల నాయకులు కూడా అనేకసార్లు ఓటమిని చవిచూసిన వారేనని, ఇప్పుడు బీసీలు ఎమ్మెల్యే టిక్కెట్టు అడగ్గానే “మీకు (బీసీలు) టిక్కెట్లు ఇస్తే ఓడిపోతారు కదా” అని వ్యాఖ్యానిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు సబబుగా లేవని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఎన్నికల్లో గెలవడానికి, ఓడిపోవడానికి దారితీసే పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సామాజిక నేపధ్యాన్నే పరిగణనలోకి తీసుకొని టిక్కెట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే పిసిసిలోని కొందరు అగ్రనాయకులు ఈ విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని, పోనీ కేవలం మొత్తం అసెంబ్లీ టిక్కెట్లు అన్నీ రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే అందరూ గెలుస్తారా? అలాగని? గ్యారెంటీ ఇవ్వగలరా? అని ఆ బిసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కేవలం మెజారిటీ అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేవలం రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టడానికి కొందరు నాయకులు చేస్తున్న తప్పుడు వాదనలేనని, స్వార్ధపూరితంగా చేస్తున్న వాదనలకు చెరమగీతం పాడాలని, లేకుంటే పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోతుందని పలువురు సీనియర్ బిసీ నాయకులు అగ్రనేతలను సున్నితంగా హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికల్లో గెలుస్తారనే భ్రమల నుంచి ఆ నాయకులు బయటకు రావాలని కోరుతున్నారు. ఇకనైనా బిసీ కులాల నాయకులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేయకుండా అసెంబ్లీ, పార్లమెంట్‌లకు పంపించేందుకు వీలుగా ఆలోచనా విధానాలను మార్చుకోవాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, పిసిసి అధ్యక్ష స్థానాల్లో ఉన్న నేతలు, అగ్రనాయకులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎన్నికల్లో వారు రాజకీయ ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ వ్యూహాలు అన్నీ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయాయని, జనాన్ని మభ్యపెట్టి స్వార్ధ రాజకీయాలు చేయాలంటే కుదరదనే విషయాలను పార్టీని నడుపుతున్న అగ్రనేతలు తెలుఉకోవాలని కోరుతున్నారు. లేకుంటే వారే (అగ్రనేతలు) నష్టపోతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కఠోర వాస్తవాలను పక్కనబెట్టి ఏకపక్షంగా, స్వార్ధంతో, ఒకే కులానికి మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లను కేటాయించాలనే ప్రయత్నాలను విరమించుకొని పార్టీలో కష్టపడ్డ నేతలు, పార్టీనే నమ్ముకొని, అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు సముచితమైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని, తద్వారా పార్టీ విజయతీరాలకు చేరుతుందని ఆ నాయకులు హితవు పలుకుతున్నారు. కాలంచెల్లిన రాజకీయ వ్యూహాలను పక్కనబెట్టి జనరంజకమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News