ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి రామకృష్ణారావును
నిలదీసిన జస్టిస్ పిసిఘోష్ కమిషన్
గంటన్నరపాటు సాగిన విచారణ
24ప్రశ్నలను సంధించిన కమిషన్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్థికశాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ఎ దుట హాజరయ్యారు. ఆయనను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు స మర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్టు డిజైన్ లు, బడ్జెట్ కేటాయింపులపై కమిషన్ ప్రశ్నించింది. డిపిఆర్ లేకుండా నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించా రు. కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చే స్తారు? డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా? అ ని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బా ధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణారావు తెలిపారు. ప్రాజె క్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని క మిషన్ ముందు చెప్పారు.
ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ, నిబంధనలు పాటించలేదని ఈ సందర్భంగా కమిషన్ వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించగా పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీలు పెట్టలేదని ఈ సందర్భంగా కమిషన్ రికార్డులు చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని కమిషన్ పేర్కొంది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, 9 నుంచి 10.5 శాతం వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు.
గంటన్నరకు పైగా సాగిన కమిషన్ విచారణ :
దాదాపు గంటన్నర పాటు రామకృష్ణారావును కమిషన్ విచారించింది. దాదాపు 24 ప్రశ్నలను రామకృష్ణను కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగారు. రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ఆయనను ముందు ప్రశ్నలు ఉంచారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, లోన్స్, ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపై వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని రామకృష్ణను కమిషన్ ప్రశ్నించగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీతో ఎప్పుడూ సమావేశం కాలేదని, కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణారావు చెప్పారు. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ అడిగింది. అలాగే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పాలసీస్ పెట్టారా అని కమిషన్ ప్రశ్నించగా దానికి రామకృష్ణారావు తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్‌గా కేబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ అడిగింది. నిబంధనలు పాటించకుండా విడుదల చేసిన నిధుల రికార్డులను రామకృష్ణారావుకు కమిషన్ చూపించింది. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను సరిగా మెయింటెయిన్ చేయలేదని కమిషన్ ప్రశ్నించగా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని రామకృష్ణ తెలిపారు. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.7382 ప్రిన్సిపల్ అమౌంట్‌కు రూ.6519 కోట్ల వడ్డీ చెల్లించామని ఆయన వెల్లడించారు. 9 నుంచి 10.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని కమిషన్‌కు రామకృష్ణా రావు తెలిపారు.
కాగా గతంలోనే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు, ఇంజనీర్లతో అఫిడవిట్‌లను కమిషన్ తీసుకుంది. ఆ అఫిడవిట్‌లను ముందు పెట్టుకునే కమిషన్ బహిరంగ విచారణ చేస్తోంది. గత జూలైలోనే విచారణకు రావాల్సిందిగా రామకృష్ణారావుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే అప్పట్లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆ ప్రిపరేషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని రామకృష్ణ చెప్పగా ఆయనకు కమిషన్ మినహాయింపు ఇచ్చింది. తిరిగి సోమవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరయ్యారు. 2 గంటలకు ప్రారంభమైన విచారణ 3:45 గంటలకు ముగిసింది.ఇదిలా ఉండగా మంగళవారం అన్నారం బ్యారేజీ నిర్మించిన నవయుగ కంపెనీ ప్రతినిధులను విచారణకు పిలిచారు. ఈ సంస్థకు సంబంధించిన ముగ్గురిని కమిషన్ విచారించనుంది. బుధవారం మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్‌అండ్ కంపెనీ ప్రతినిధులను విచారించనుంది. గురువారం సుందిళ్ల బ్యారేజీ కట్టిన ఆఫ్కాన్స్ కంపెనీ ప్రతినిధులను విచారణకు పిలవాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భావిస్తోంది.