Wednesday, January 1, 2025

అబద్ధాలు చెబితే.. ఇబ్బందులు తప్పవు

- Advertisement -
- Advertisement -

ఇరిగేషన్ ఇంజినీర్లపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం
డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడుతారని నిలదీత

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఆర్డర్ ప్రకారం బ్లాకులు కట్టకపోవడంపై కమిషన్ ఆ గ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కవిషన్ వి చారణ జరిపింది. మంగళవారం విచారణకు 16 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భం గా కమిషన్ ప్రశ్నలకు కొంత మంది అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. సుందిళ్ల బ్యారేజీలోని 2ఏ బ్లాకును డిజైన్ లేకుండానే నిర్మాణం ప్రారంభించినట్టు ఘోష్ కమిషన్ ముందు ఇంజినీర్లు తెలిపారు.

గతంలో వారు దాఖలు చేసిన అఫిడవి ట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన అంశాలపై డీఈ, ఏఈఈలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. రెండో బ్లాక్‌ను పరిగణనలోకి తీసుకుని సుందిళ్ల బ్యారేజీ 2 ఏ బ్లాక్ నిర్మాణాన్ని డిజైన్ లేకుండానే ప్రారంభించినట్టు ఇంజినీర్లు తెలిపారు. అప్పటి చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడతారని జస్టిస్ పీసీ ఘోష్ ఆక్షేపించారు. కొందరు ఇంజినీర్ల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ ఛైర్మన్ తప్పుదోవ పట్టించవద్దని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లో ఒక సమాచారం, విచారణలో మరొక సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెబుతారని మండిపడ్డారు. అలా చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పనులకు సంబంధించిన ప్లేస్‌మెంట్ రిజిస్టర్లు, మెజర్మెంట్ బుక్స్ పై ఇంజనీర్ల సంతకాలు తీసుకున్న కమిషన్ వాటిని స్వాధీనం చేసుకుంది. బుధవారం మరో 18 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News