Sunday, December 22, 2024

మేడిగడ్డను పరిశీలించిన జస్టిస్ ఘోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పి నాకి చంద్ర ఘోష్, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌కు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్‌పి కిరణ్ ఖరే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎక్కువగా కుంగిన 20వ నంబరు పిల్లర్, పాక్షికంగా కుంగిన 19, 21వ నెంబర్ పిల్లర్లను అధికారు లు, నిపుణుల బృందం పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై 7వ బ్లాక్‌లో వంతెనపై కాలినడకన సాగుతూ అణువణువు నా పరిశీలించారు. 7వ బ్లాక్‌లో 20వ పిల్లర్ దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి అధికారుల నుంచి వివరాలను సేకరించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని 19, 20, 21వ పిల్లర్లను పరిశీలించారు. పిల్లర్ల్ల కింది భాగంలో వచ్చిన పగుళ్లను నిశితంగా పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీ దె బ్బతిన్న పరిస్థితులు, పిల్లర్ల్ల కుంగుబాటు పై పలు అంశాలపై అధికారుల ద్వారా వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి లో కమిషన్ పర్యటిస్తోందని, ఇరిగేషన్ శాఖ నిపుణులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని అన్నారు. తమ ప రిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఅండ్ ఎం జనరల్ అనిల్‌కుమార్, ఓఅండ్‌ఎం ఇఎన్‌సి నాగేందర్‌రావు, సిఇ సుధాకర్‌రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ సిఇ వెంకటకృష్ణ, ఇఇ తిరుపతిరావు, ఎల్‌అండ్‌టి ప్రాజెక్టు మేనేజర్ రజనీష్ తదితరులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News