Sunday, January 12, 2025

విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్

- Advertisement -
- Advertisement -

హైదాబాద్: విద్యుత్తు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాగా దానిపై బిఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు, విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టు న్యయామూర్తిగా పనిచేసిన లోకూర్, 2011 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News