Thursday, January 23, 2025

సుప్రీం జడ్జీలుగా జస్టిస్ మిశ్రా, విశ్వనాథన్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్ శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. సిజెఐతో కలుసుకుని సుప్రీంకోర్టు పూర్తి సామర్ధ్యం 34మంది న్యాయమూర్తులు కాగా కొత్త న్యాయమూర్తుల ప్రమాణంతో ఇది పూర్తి సామర్ధ్యానికి చేరుకుంది.
కొత్తగా నియమితులైన న్యాయర్తుల చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలోపలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Also Read: కదులుతున్న కారులో మైనర్‌పై సామూహిక అత్యాచారం….

2009 అక్టోబర్ 13న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ మిశ్రా 2021 అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1966 మే 26న జన్మించిన విశ్వనాథన్ రాజ్యాంగపరమైన చట్టం, క్రిమినల్ లా, కమర్షియల్ లా, ఇన్సాల్వెన్సీ, ఆర్టిట్రేషన్ లాతోసహా భిన్న అంశాలకు సంబంధించిన కేసులో గతంలో వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News