మన తెలంగాణ/హైదరాబాద్ : తప్పుడు ఆధారాలతో సమాధానాలు ఇస్తే సహించబోమని జ స్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వెలిబుచ్చారు.కాళేశ్వ రం ప్రాజెక్టుకు ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెం కటేశ్వరావును శనివారం విచారణ సందర్భం గా న ల్లాపై కమిషన్ పలు ప్రశ్నలను సంధించిం ది. న ల్లా కమీషన్‌కు తప్పుడు ఆధారాలతో వి చారణనే తప్పుదోవ పట్టిస్తున్నట్టు గ్రహించింది. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. సీకెంట్ ఫైల్స్‌పై వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇస్తారా? అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు.ప్రత్యేకంగా మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్ ఫైల్స్ వినియోగించమని ఎ వరు సూచించారని కమిషన్ చైర్మన్ ప్రశ్నించ గా సీడీఓసీఈ సూచనల మేరకు ఇలా చేశానని సమాధానమిచ్చారు. దీనిపై కమిషన్ తీవ్ర ఆ గ్రహం వ్యక్తం చేసింది.కమిషన్‌ను తప్పుదోవ ప ట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు గమనించి వెం ట నే.. కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేయవద్దని ఘాటుగా జస్టిస్ ఘోష్ వ్యా ఖ్యానించారు.ఇష్టం వచ్చినట్లు సమాధానాలు చెబితే నమ్ముతామని అనుకున్నారా ఆని నిలదీశారు.
తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని ఘాటుగానే హెచ్చరించారు. అయితే, తన సమాధానాన్ని సరిచూసుకునే అవకాశం ఇ వ్వాలని వెంకటేశ్వర్లు కోరగా దీనికి అంగీకరించబోనని తేల్చి చెప్పారు. తగిన ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు సమర్పిస్తే , ఆ తరువాత సవరించుకునే అవకాశం ఇస్తామని తెలిపారు. తనకు ఆంగ్లంపై పూర్తిగా పట్టు లేదని వెంకటేశ్వర్లు తెలపగా ఆంగ్లంపై పట్టు లేకుండానే కాళేశ్వరం సీఈగా ఈఎన్సీగా ఎలా పని చేశారని కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. డీపీఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయన్న కమిషన్ గేట్ల సంఖ్య, సైజ్, రాఫ్ట్, పిల్లర్ల సంఖ్యలో మార్పు ఎందుకు వచ్చిందనే వివరాలు కోరింది. ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారని ప్రశ్నించింది. బ్యారేజీ పొడవులో మార్పు ఎందుకు వచ్చిందని కమిషన్ అడిగిన ప్రశ్నకు సీడీఓ సీఈ నిర్ణయం మేరకే మార్పులు జరిగాయని ఈఎన్సీ వెంకటేశ్వర్లు వివరించారు. కాగా సవరించిన అంచనాలను ఎవరు ఎప్పుడు ఆమోదించారనే విషయంపై కమిషన్ ఆరా తీసింది. 2018 మే 19న మొదటి, 2021 సెప్టెంబర్ 6న రెండో సవరణ జరిగిందని వెంకటేశ్వర్లు కమిషన్‌కు తెలిపారు.
ఆనకట్టల నిర్మాణానికి 11 అనుమతులు తీసుకున్నట్లుగా తెలిపారు. కాగా ఉన్నత స్థాయి కమిటీలో ఉండే వారి గురించి ఘోష్ కమిషన్ ఆరా తీసింది. నల్లా వెంకటేశ్వర్లుపై కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించిన కమిషన్ బ్యారేజీల నిర్మాణ వ్యయం ఎంత? వ్యాప్కోప్ నివేదికను ఎవరు ఆమోదించారు? సవరించిన అంచనాలు ఆమోదించింది ఎవరు? ఎప్పుడు? తదితర అంశాలపై కమిషన్ ఆరా తీసింది. దీనిపై వెంకటేశ్వర్లు వివరణఇస్తూ నిర్మాణానికి సంబంధించిన వివరాలు డీపీఆర్‌లో ఉన్నాయని వాటిని రేపు ప్రకటిస్తామని తెలిపారు. వ్యాప్కొప్ నివేదికను 2016లో ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించిందని కమిషన్‌కు తెలిపారు. 2018 మే 19న మొదటి,2021 సెప్టెంబర్ 6న రెండో సవరణ జరిగిందని వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి 11 అనుమతులు తీసుకున్నట్లుగా తెలిపారు.
ఉన్నతస్థాయి కమిటీపై ఆరా :
కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీలో ఉండేవారి గురించి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. కమిటీలో సీఎంఓ కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, వ్యాప్కోస్ సభ్యుడు ఉంటారని కమిషన్‌కు వెంకటేశ్వర్లు తెలిపారు.మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ల డ్యామేజీకి కారణలపై కమిషన్ ప్రశ్నించగా మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే దెబ్బతిందని సమాధానమిచ్చారు. భూసేకరణ సమస్య, విద్యుత్ పొదుపు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం, సుందిళ్ల సైట్లను మార్చినట్లుగా వెంకటేశ్వర్లు తెలిపారు. అఫిడవిట్‌లో ఉన్న అంశాలనే క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో చూసి చెబుతుండటం పట్ల మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపైన జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.విచారణను ఆర్ధాంతరంగా ముగించారు. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని కమీషన్ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు సూచించింది.