Thursday, January 23, 2025

ఇక ఆకస్మిక తనిఖీలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ సన్నద్దమవుతోంది. ప్రాజెక్టులోని వివి ధ రకాల నిర్మాణ పనులు,వాటి డిజైన్లు , తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీల ద్వారా సేకరించాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజిలకు సబంధించిన లోపాలపైన మధ్యంతర నివేదికలు అందజేయాలని నిపుణుల కమిటీని ఆదేశించింది.మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆ నకట్టలపై రెండు వారాల్లోపు మధ్యంతర నివేది క ఇవ్వాలని నిపుణుల కమిటీని జస్టిస్ పిసి ఘో ష్ ఆదేశించారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్ గురువారం నిపుణుల కమిటీతో సమావేశమైంది.

ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించిన కమిటీ సభ్యులు వారి పరిశీలన, అధ్యయనంలో గుర్తించిన అం శాలను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌కు వివరించారు. సాంకేతిక పరమైన అంశాలు, అంతర్జాతీ య పరంగా అవలంభించే విధానాలను కమిషన్‌కు వివరించారు. బ్యారేజీలుగా నిర్మించి ఎక్కు వ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తింద ని వారు కమిషన్‌కు చెప్పినట్లు సమాచారం.ఈ పరిశీలన అంశాల ఆధారంగా రెండు వారాల్లో గా మధ్యంతర నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత పూర్తి నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి జస్టి స్ పిసి ఘోష్ స్పష్టం చేశారు. హైడ్రాలజీ విభాగానికి చెందిన ఇంజినీర్లను కమిషన్ విచారణ చేసింది. వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చే యాలని ఆదేశించింది. అఫిడవిట్లు అన్నీ అందా క, వాటిని పరిశీలించిన తర్వాత బీఆర్కే భవన్‌లోనే బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పి సి ఘోష్ తరువాయి 6లో
సిద్ధమవుతున్నారు. అఫిడవిట్ల పరిశీలన అనంతరం ఈ పథకం పనులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.

ఆర్ధిక అంశాలపైనా దృష్టి:
సాంకేతిక అంశాల అనంతరం ఆర్థిక అంశాలపైన కూడా కమిషన్ దృష్టి సారించనుంది. ఆనకట్ట నిర్మాణ పనుల ప్రాధమిక అంచనాలు,పనులు జరుగుతుండగానే వాటి పెంపుదల, కాళేశ్వరం పథకం నిర్మాణం కోసం ఆర్దిక సంస్థల ద్వారా తెచ్చిన రుణాలు, వడ్డీ రేట్లు, తదితరాలపై విచారణ చేయనున్నారు. కొంతమంది వ్యక్తుల నుంచే కాకుండా , ఇతర మార్గాల్లో కూడా కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదిక సమర్పించాలని గతంలోనే కమిషన్ ఆదేశించినా అది ఇప్పటికీ చేరలేదని అంటున్నారు. దీంతో వెంటనే నివేదిక సమర్పించాలని కమిషన్ మరోమారు స్పష్టం చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నుంచి కమిషన్ నివేదిక కోరింది. విచారణ ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక పర్యటనలకు కూడా వెళ్లాలని జస్టిస్ పిసి ఘోష్ భావిస్తున్నట్లు సమాచారం.

విజిలెన్స్ కమిటీ రిపోర్టు :
జెఎన్‌టియూ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర రావు ఛైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సీఈ సత్య నారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణ మూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా, ఇఎన్‌సి అనిల్ కుమార్ కన్వీనర్‌గా ఉన్నారు. కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలను పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ భూమిలోకి కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద ఉత్పన్నమైన నీటి లీకేజిలు , బుంగలు తదితర సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేశారు. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News