- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి నిర్మాణాల అక్రమాలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్ట్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగింది. వాస్తవానికి కమిషన్ గడువు ఈనెలాఖరుతో ముగుస్తుంది. ఇదిలా ఉండగా ఈనెల 23న జస్ట్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్‌కు రానున్నారు. వచ్చే వారంలో చివరి విచారణలో భాగంగా రాజకీయ ప్రముఖులను, గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -