మన తెలంగాణ/హైదరాబాద్ : గోదావరినదిపైన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్నది కేసిఆర్ ప్లా నే అని విశ్రాంత ఇంజనీర్ల కమిటీ జస్టిస్ పి.పి. ఘోష్ కమిషన్ ముందు వెల్లడించినట్టు సమాచా రం. తుమ్మడిహెట్టి వద్ద తాము చేసిన ప్రతిపాదనను వద్దని పక్కన పడేశారని వివరించినట్టు తెలిసింది. తాము అందజేసిన నివేదికపైన ఆనాటి నీ టిపారుదల శాఖమంత్రి, ముఖ్యమంత్రి సంతకా లు చేయలేదని వివరించినట్టు తెలిసింది. విశ్రాంత ఇంజనీర్లు ఈ సందర్భంగా తాము ప్రతిపాదించిన నివేదికను కమిషన్‌కు అందచేశారు. ఆనకట్ట ని ర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ము ఖ్యమంత్రి కెసిఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ముందు చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ శనివారం విశ్రాంత ఇంజినీర్లతో సమావేశమయ్యారు. 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజినీర్ల కమిటీ సభ్యులు కమిషన్‌కు వివరించారు. నివేదికలోని అన్ని అం శాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రాణహిత – చేవె ళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు గోదావరి జలాల లభ్యత, కేంద్ర జల సంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా మేడిగడ్డను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూ డా జస్టిస్ పిసి ఘోష్ దృష్టి సారించారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో కమిషన్ ఉంది. నిర్మాణ సంస్థల ఖా తాలు పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వ స్తాయని, అవసరమైతే
ఆర్‌ఓసీ నుంచి వివరాలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తయిన నేపథ్యంలో అఫిడవిట్లు అన్నీ వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ ప్రారంభించనుంది. ఈ విచారణ ఈ నెల 27 వరకు కొనసాగనుంది. అఫిడవిట్లు అన్నీ కార్యచరణ ప్రారంభించిన తర్వాత బహిరంగ విచారణ నిర్వహించి క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఇఇ స్థాయి వరకు ఇంజినీర్లను విచారణ చేసిన కమిషన్ కింది స్థాయిలో ఉన్న డిప్యూటీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను విచారణ చేయాలా వద్ద అన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పిలిచినవారు రావాల్సిందే: జస్టిస్ పిసిఘోస్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ ప్రక్రియలో భాగంగా విచారణకు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే అని జస్టిస్ పి.సి.ఘోస్ అన్నారు. శనివారం జస్టిస్ ఘోష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ పిలిచిన వారు రాకపోతే ఎం చేయాలో తమకు తెలుసన్నారు. అందుకు అవసరమైన అధికారాలు కూడా కమిషన్‌కు ఉన్నట్టు తెలిపారు. మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజి పనులకు సంబంధించిన సబ్‌కాంట్రాక్టర్లను గుర్తించే చర్యలు చేపట్టామన్నారు. ఆ సంస్థలకు డేటాను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి తీసుకుంటామని తెలిపారు. ఆయా కంపెనీల ఖాతాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పరిశీలిస్తే ఎంత మొత్తం చేతులు మారిందనేది తెలిసిపోతుందన్నారు. ప్రస్తుతం ఏడిఈ స్థాయి ఇంజనీర్లను విచారణకు పిలవాల వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు. అన్ని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాతే కేంద్ర జలసంఘం వారిని పిలుస్తామని జస్టిస్ పి.సి.ఘోస్ పేర్కొన్నారు.