Thursday, December 19, 2024

నిర్లక్ష్యమే నిలువునా కూల్చింది!

- Advertisement -
- Advertisement -

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం నిర్మాణం లో అధికారుల నిర్లక్షమే మేడిగడ్డ బ్యారేజీని నిలువునా కూల్చివేసింది. భారీగా నీటిని నిల్వ చేయడం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ నిలువునా కూలిపోయింది. అధి కారుల భాధ్యతారాహిత్యం ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా ఈ ప్రాజెక్టుపై ప్ర భుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్‌ను కూడా గురిచేసేంత గా ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ శుక్రవారం విచారణ కొనసాగించింది. బాధ్యతగల ఒక అధికారిని కమీషన్ అడిగిన ప్రశ్నలకు తెలీదు..గుర్తు లేదు.. మర్చిపోయా అన్న సమాధానాలు కమీషన్‌ను షాక్‌కు గురిచేశాయి.కమీషన్ ఎదుట తెలంగాణ ఇంజనీరింగ్ లేబోరేటరి అధికారులు , ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. గతంతో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని కమీషన్ చైర్మన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ జరగలేదా అని కమీషన్ రీసెర్చ్ ల్యాబ్ ఇంజనీర్లను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ,అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిసెర్చ్ పనులు ఒకవైపున కొనసాగుతుండగానే మరో వైపు నిర్మాణం కూడా జరిగిందని రీసెర్చ్ ల్యాబ్ ఇంజనీర్లు వెల్లడించారు.నిర్మాణానికి ముందు , మధ్యలో , తర్వాత కూడా మోడల్స్ నిరవ్హించినట్టు రీసెర్చ్ ఇంజనీర్లు తెలిపారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణం చేపట్టారని , నీటిని భారీగా నిల్వ చేయడం వల్లేనే మేడిగడ్డతోపాటు ఇతర బ్యారేజీల్లో సమస్యలు ఉత్పన్నమైనట్టు తెలిపారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెలో బ్లాక్‌లో మార్పులు , సవరణలు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. బ్యారేజిల్లో సమస్యలు ,మోడల్ స్టడీస్‌కు సంబంధం లేదని వివరించారు. నిబంధనల ప్రకారమే టిఎష్ ఈఆర్‌ఎల్ పనిచేసిందని కమీషన్‌కు వెల్లడించారు. లొకేషన్ , సిడిఒ అధారిటీ నివేదికల ఆధారంగా రిసెర్చ్ చేసినట్టు తెలిపారు. మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజీల్లో 2016నుంచి 2023వరకూ రీసెర్చ్ బృందం అధ్వర్యంలో మోడల్ స్టడీస్ జరిగినట్టు వెల్లడించారు.

కమీషన్‌ను నిర్వేరపర్చిన శ్రీదేవి :
న్యాయ విచారణలో భాంగంగా కమీషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోస్ అడిగిన ప్రశ్నలకు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి ఇచ్చిన సమాధానాలు నివ్వెరపోయేలా చేశాయి. ఏ ప్రశ్న అడిగినా సరే.. ఆమె నుంచి తెలియదు..గుర్తు లేదు ..మర్చిపోయా అంటూ సమాధానాలు వచ్చాయి. శ్రీదేవి తెలివితేటల పట్ల విచారణ హాల్‌లో ఉన్నవారంతా షాక్‌కు గురికావాల్సివచ్చింది.2017నుంచి 2020వరకూ కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు ప్రధాన బ్యారేజీల నిర్మాణం సమయంలో శ్రీదేవి పనిచేశారు. మోడల్ స్టడీస్ ఎప్పడు చేశారు?, వరదలు ఎప్పుడు వచ్చాయి?, అనే ప్రశ్నలకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి నుంచి తనకు గుర్తు లేదంటూ దాటవేత సమాధానాలు వచ్చాయి. కమీషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధానం ఇది కాదని జస్టిస్ పిసి ఘోస్ సూచించారు.

పనిచేసిన సమయంలో ఏమి గుర్తు ఉన్నాయో వాటినే తెలపాలని , గుర్తు ఉన్నంతవరకూ చెప్పాలని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవికి సూచించారు.మోడల్ స్టడీస్ పూర్తికాకముండే నిర్మాణాలు ప్రారంభమైనట్టు కమీషన్ ఎదుట రీసెర్చ్ ఇంజనీర్లు అంగీకరించారు. మేడిగడ్డతోపాటు ఇతర బ్యారేజీలకు నష్టం జరగడానికి కారణం నీటిని అధికంగా నిల్వ చేయడం వల్లనే అని కమీషన్‌కు తెలిపారు. గోదావరి నదిలో వరద ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా క్షేత్ర స్థాయి అధికారులు నిర్లక్షం వహించినట్టు కీమషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు వెల్లడించారు. మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజిలలో నీటిని నిలువ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలపాలని కమీషన్ ప్రశ్చించింది. ఒక వైపు రీసెర్చ్ జరుగుతండగానే ,మరో వైపున నిర్మాణాలు కొనసాగాయని ఇంజనీర్లు విచారణలో తేల్చిచెప్పారు.శుక్రవారం నాటి విచారణకు మనోజ్ కుమార్ , దుర్గాప్రసాద్, ప్రమీల , శ్రీదేవి తదితర అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News