Thursday, December 26, 2024

ఫైళ్లు పరిశీలించకుండానే అఫిడవిట్ ఎలా ఇచ్చారు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది. బుధవారం జరిగిన విచారణకు కాళే శ్వరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ చీప్ ఇంజినీర్ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేందర్‌పై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు మూడు గంటల పాటు 130కి పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయినట్లు ఇచ్చిన సర్టిఫి కెట్‌లో నిబంధనలు పాటించలేదని నాగేందర్ తెలిపారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేక పోవడం వల్లే బ్యారేజీలలో లీకేజీలు జరిగాయా? గేట్స్ ఆపరేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయని కమిషన్ ప్రశ్నించింది. రామగుండం ఈఎన్‌సీ చేతిలోనే మూడు బ్యా రేజీలు నడిచినట్లు కమిషన్ ముందు చెప్పారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే బ్యారేజీలలో లీకేజీలు జరిగాయా, గేట్స్ ఆపరేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరు గుతాయి? నీళ్లను ఎవరు స్టోరేజ్ చేయమన్నారని కమిషన్ ప్రశ్నించింది. అలాగే వర దల సమయంలో గేట్లు ఓపెన్ చేయకూడదని ఎవరు

ఆదేశించారని నాగేందర్‌ను ప్రశ్నించింది. పరిమితికి మించి మ్యారేజీలలో నీళ్లను స్టోర్ చేయమని ఎవరు ఆదేశించారని కమిషన్ అడిగింది. మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ మాన్యువల్ ప్రిపేర్ చేసిందా అంటూ ఈఎన్‌సీ నాగేందర్‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. కాగా రామగుండం ఈఎన్సీ నిబంధనలు పాటించలేదని కమిషన్ ముందు నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్ తీరుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్ని సార్లు సందర్శించారని కమిషన్ ప్రశ్నించగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ప్రమాదం జరగకముందు పరిశీలించానని అజయ్ బదులిచ్చారు.

దాంతో సుందిళ్ల బ్యారేజీని ఎందుకు పరిశీలించలేదు? తొలిసారి వరద వచ్చాక 3 బ్యారేజీలను సందర్శించారా అని కమిషన్ ప్రశ్నించింది. సమస్యలు ఉన్నాయని నివేదిక రాకపోవడంతో సందర్శించలేదని జవాబిచ్చారు. అయితే క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉంటూ రికార్డులను సరిచూసుకోకుండానే అఫిడవిట్ ఎలా సమర్పిస్తారని కమిషన్ నిలదీసింది. రామగుండం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయా అని కమిషన్ ప్రశ్నించగా2021 జనవరి వరకు ఆపరేషన్ సైన్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకమైన సిబ్బంది లేరని కమిషన్ ముందు నాగేందర్ తెలిపారు. 2021 జనవరిలో ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ టీం ఫామ్ అయిన తర్వాత రామగుండం ఈఎన్‌సీకి రిపోర్టు ఇచ్చామని తెలిపారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చిన రిపోర్టులపై ఎలాంటి యాక్షన్ రామగుండం ఈఎన్‌సీ తీసుకోలేదన్నారు.

ఓ అండ్ ఎం ఇన్స్పెక్షన్ రిపోర్టును కమిషన్‌కు ఈఎన్‌సీ నాగేందర్ అంద చేశారు. సీడబ్ల్యుసీ మాన్యువల్ నిబంధనలు ఫాలో చేశారని కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఫాలో చేయలేదని నాగేందర్ సమాధానం ఇచ్చారు. “ఐ ఎస్ కోడ్ పాటించారా?” అని అడగగా లేదని సమాధానమిచ్చారు. డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా అని అధికారులను కాళేశ్వరం కమిషన్ అడిగింది. నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ ఆపరేషన్స్ ప్రోటోకాల్ డ్యామ్ సేఫ్టీ ఆక్ట్ ఫాలో అయ్యారా అన్న ప్రశ్నకు కాలేదని నాగేందర్ సమాధానం చెప్పారు. వెథర్స్ షెడ్యూల్ ఫాలో అయ్యారా అని ప్రశ్నించగా దానికి కూడా కాలేదనే ఈఎన్సీ సమాధానం చేశారు. మూడు బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేశారా అని కమిషన్ ప్రశ్నించగా 2019 నుంచి మూడు బ్యారేజీల్లో పరిమితి నీళ్లను నిల్వ చేసినట్లు కమిషన్ ముందు నాగేందర్ వెల్లడించారు. ప్రమాదం జరిగే ముందు ఓ అండ్ ఎం పరిశీలన చేశారా, బ్యారేజీల్లో నీళ్లను నిల్వ చేయాలని ఎవరు? ఆదేశించారంటూ కమిషన్ అడిగిన ప్రశ్నకు రామగుండం ఈఎన్సీకి మౌఖిక ఆదేశాలు ఉన్నాయన్నట్లుగా కమిషన్ ముందు ఈఎన్‌సీ నాగేందర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News