Friday, December 27, 2024

నీరెత్తి పోయడానికి ఇంత ఖర్చా?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం ద్వారా గోదావరి నదీ జలాలను కేవలం మూడు నెలలు మాత్రమే ఎత్తిపోసేందుకు ప్రభుత్వం చేసిన వేలకోట్ల రూపాయల ఖర్చు కాళేశ్వరం జ్యుడిషియరి కమిషన్‌ను నివ్వెరపోయే లా చేసింది. వరదీనీటిని ఎత్తిపోసేందుకు ఇంత పెద్దమొత్తంలో ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా అని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోస్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన లో టుపాట్లు, గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లీకేజీలు తదితర అంశాలపైన సమగ్ర విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు శుక్రవావారం నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో విచారణ నిర్వహించింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)తో పాటు ఆపరేషన్ మెయింటనెన్స్ (ఒఅండ్‌ఎం) విభాగాల ఇంజినీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు.

మూడు ఆనకట్టలకు సంబంధించి వారిని విచారణ చేశా రు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆరా తీసింది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా, భారీ వ్యయంతో ఎత్తిపోతలు చేపట్టాల్సిన అవసరం, అందుకు గల కారణాలను అన్వేషించే పనిలో భాగంగా అధికారులను లోతుగా ప్రశ్నించింది. ప్రాణహితచేవెళ్ల ఎత్తిపోతలతో పాటు మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే విషయమై ఐదుగురు సభ్యులతో కూడిన విశ్రాంత ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక తమకు అందజేయాలని సూచించింది. దానిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను
ఆరా తీసింది. ప్రాణహితచేవెళ్లను కాదని కాళేశ్వరం చేపట్టడానికి గల కారణాలు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నారన్న విషయాలను నివేదించాలని నీటి పారుదల శాఖను కమిషన్ ఆదేశించింది.

గోదావరిలో నీరు ఉండగా, ప్రాణహిత జలాలను ఎత్తి పోయాల్సిన అవసరం ఏమిటన్న విషయమై కూడా కమిషన్ ఆరా తీస్తోంది. ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని తుది నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్‌కు సంబంధించి పూణేలోని సిడబ్ల్యూపిఆర్‌ఎస్ నుంచి కూడా నివేదిక కోరారు. మూడు ఆనకట్టలకు సంబంధించి వారిని విచారణ చేశారు. ఆ వ్యవహారాలకు సంబంధించి వారు నిర్వర్తించిన పాత్ర, సంబంధిత అంశాల గురించి ఆరా తీశారు. దీంతో ఇంజినీర్లకు సంబంధించిన విచారణ దాదాపుగా పూర్తయింది. ఈ నెల 27వ తేదీలోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక, 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News