Sunday, December 22, 2024

నూతన సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ చేయించారు. వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా.

కాగా, ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం వంటి పలు కీలకమైన సుప్రీంకోర్టు తీర్పుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా భాగంగా ఉన్నారు. ఇప్పటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ DY చంద్రచూడ్(65) పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాద్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News