Wednesday, January 22, 2025

కెబిఆర్ పార్కులో మొక్కలు నాటిన చీఫ్ జస్టిస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కులో నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు చీఫ్ జస్టిస్ మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో చీఫ్ జస్టిస్ మర్రి మొక్కను, జస్టిస్ నవీన్ రావు నేరేడు మొక్కను, ఎంపీ సంతోష్ కుమార్ వేప మొక్కను నాటారు. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ వివరించారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు చాలా బాగున్నాయని చీఫ్ జస్టిస్ అన్నారు. అనంతరం ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే మార్గమని చెప్పారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ మూడు పీ -పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్ లను విధిగా అనుసరించాలని పేర్కొన్నారు.

Justice Satish Chandra plant Sapling in KBR Park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News