Monday, December 23, 2024

ఎపి గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి గవర్నర్‌గా జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సిఎం వైఎస్ జగన్‌, పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి జనవరిలో రిటైర్ అయ్యారు.

కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల 10మంది గవర్నర్లను నియమించారు. వీరిలో కొంతమంది బదిలి అయ్యారు. ఎపికి కొత్త గవర్నర్ గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమించడంతో.. ఇప్పటివరకు ఎపి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఛత్తీస్‌గఢ్‌ కు బదిలి అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News