Monday, December 23, 2024

బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

మల్కాజ్‌గిరి జోన్ రివ్యూ మీటింగ్
రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఆదేశం

మనతెలంగాణ, సిటిబ్యూరో: బాధితులకు సత్వరమే న్యాయం చేసే విధంగా చూడాలని పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశించారు. మల్కాజ్‌గిరి జోన్ పోలీస్ అధికారులతో గురువారం సిపి డిఎస్ చౌహాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిపి డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ నేరాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమాజం ప్రశాంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ఏరియాల్లో కమ్యూనిటీ సిసిటివిలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు.

యువత అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. యువత అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడాలని కోరారు. సైబర్ నేరాలు జరగకుండా ఉండేందుకు వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోషల్ మీడియాలో సైబర్ నేరాలపై విస్కృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. సమావేశంలో డిసిపి, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News