Thursday, October 24, 2024

ట్రూడో రాజీనామాకు 24 మంది ఎంపీల డిమాండ్!

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు స్వపక్షంలోనే వ్యతిరేకత మొదలయింది. ఆయన రాజీనామా చేయాలంటూ 24 మంది లిబరల్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ బుధవారం అంతర్గత సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతినడానికి ట్రూడో వైఖరే కారణమని స్వపక్ష సభ్యులే అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. పైగా ట్రూడో అక్టోబర్ 28 లోగా రాజీనామా చేయాలని గడువు పెట్టారు. ఇప్పటికే మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి ఇదో సవాలుగా మారనుంది. ఇటీవల నానోస్ రీసెర్చి నిర్వహించిన సర్వేలో అక్టోబర్ 15 నాటికి ప్రజల్లో 39 శాతం మద్దతు కన్జర్వేటివ్ లకు ఉండగా, లిబరల్స్ కు కేవలం 23 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడయింది. ఇక న్యూడెమోక్రాట్స్ కు 21 శాతం మంది సానుకూలంగా ఉన్నట్లు తేలింది. ట్రూడో వైఖరి కారణంగా ఈ మధ్య కెనడా, భారత్ సంబంధాలు చెడిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News