ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని సాధించారు. ఇది ట్రూడోకు మూడోసారి విజయమే అయినప్పటికీ పూర్తి మెజారిటీ(అబ్సల్యూట్ మెజారిటీ)ని ఆయన సాధించలేకపోయారు. అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీల మధ్య హోరాహోరి పోటీ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఎరిన్ ఒ టూలే తమ ఓటమిని అంగీకరించడంతో ప్రధాని జస్టిస్ ట్రూడో విజయం ఖాయమైంది.
కెనడా పార్లమెంటులో మొత్తం 338 సీట్లు ఉండగా పూర్తి మెజారిటీ సాధించాలంటే 170 సీట్లు గెలవాల్సి ఉంటుంది.అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ట్రూడో పార్టీ 156 స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష కనర్వేటివ్ పార్టీ 121 స్థానాలు పొందింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షపార్టీ ఓటమిని ఒప్పుకోవడంతో జస్టిన్ ట్రూడో హ్యాట్‌ట్రిక్ విజయానికి మార్గం సుగమమైంది.దాంతో ఆయన “థ్యాంక్ యూ,కెనడా…” అంటూ ట్వీట్ చేశారు.
Thank you, Canada — for casting your vote, for putting your trust in the Liberal team, for choosing a brighter future. We're going to finish the fight against COVID. And we're going to move Canada forward. For everyone.
— Justin Trudeau (@JustinTrudeau) September 21, 2021