Sunday, September 8, 2024

ఫోన్ ట్యాపింగ్ దొంగలు కెటిఆర్, హరీశ్‌రావులను అరెస్టు చేయాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ అర్బన్ : ఫోన్ ట్యా పింగ్‌లో తన పేరు ఉండడానికి బిఆర్‌ఎస్ నేతలు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు బాధ్యులని కాం గ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. ట్యాపింగ్ దొంగలు కెటిఆర్, హరీశ్‌రావులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ డిసిసి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ ఐజి రా ధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలో తన పేరు ఉండడం బాధాకరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ కార్యకర్తలకు తా ము ఇచ్చిన సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వా రా తెలుసుకుని ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిం చి ఓటమికి కారణమయ్యారని బిఆర్‌ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కు టుంబం రాష్ట్రాన్ని దోచుకునేందుకే ప్రతిపక్షాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగాన్ని సొంత ఇంటి నౌకర్లుగా వాడుకుని ప్రజలను, ప్రతిపక్షాలను ఇబ్బందులు పె ట్టారని అన్నారు. అయినప్పటికి బిఆర్‌ఎస్ ఓటమి నుం డి తప్పించుకోలేక పోయారన్నారు.

జువ్వాడి రత్నాకర్‌రావు నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వివిధ హోదాల్లో సేవలందించారని మచ్చలేని మహానేతగా ఉన్నారని అతని అడుగు జాడల్లో ప్రజా సేవలో పాలుపంచుకుంటున్న తమలను ఇబ్బందులకు గురిచేసిన పాపం ఊరికే పోదన్నారు. ఎన్నికల్లో జరిగిన కుట్రలతో తాను ఓటమి చెందినా ప్రజలు తన ను ఆదరిస్తూనే ఉన్నారని, నైతికంగా విజయం తనదేనని అన్నారు. సిబిఐ విచారణ జరుపుతుంటే భూముల కబ్జాలు చేసినవారు బయటకు వస్తున్నారని, సినీనటుల దంపతుల ఫోన్లు ట్యా పింగ్ చేసి కాపురాలు కూల్చి వేశారని బిఆర్‌ఎస్ నాయకుల దిగజారుడు ఇంత దారుణమా అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల, యజమానుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. బిఆర్‌ఎస్ చేసిన తప్పిదాలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీని ప్రజలు నమ్మలేరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.

కరీంనగర్ డిసిస్లి అధ్యక్షుడు, మానకొండూర్ ఎంఎల్‌ఎ కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ కూడా బిఆర్‌ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగినట్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన మాజీ డిసిపి రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలో ఉండడంపై పలువురు కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులైన బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పురుమల్ల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, ఎస్‌టి సెల్ అధ్యక్షుడు బానోతు శ్రావణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, నూనె గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News