- Advertisement -
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు టోర్నమెంట్‌లలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది. 2021లో ఏప్రిల్ 22న ఆమె నటుడు విష్ణు విశాల్‌ని వివాహం చేసుకుంది. అయితే నాలుగు సంవత్సరాల తర్వాత వీరి పెళ్లిరోజునే మరో సంబరం జరిగింది. జ్వాలా దంపతులకు పాప పుట్టింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.‘మాకు ఆడపిల్ల పుట్టింది.. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు’ అంటూ పోస్ట్ చేశారు. తమ నాలుగో పెళ్లి రోజే పాప పుట్టడం మరింత ఆనందంగా ఉందని ఆ దంపతులు తెలిపారు. ఇది తమకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తామని.. నాలుగో పెళ్లి రోజే పాప పుట్టడం మరింత ఆనందంగా ఉందని స్పష్టం చేశారు.
- Advertisement -