Thursday, December 19, 2024

టేబుల్ టెన్నిస్‌లో బంగారు, వెండి పతకాలు సాధించిన జ్వలిత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చర్ల: మండలానికి చెందిన పరిటాల జ్వలిత్ రాష్ట్రస్థాయి ఈపైన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ అండర్ 13 విభాగంలో బంగారు పతకం సాధించాడు. డబుల్స్ విభాగంలో సైతం తన సత్తను చాటి సిల్వర్ పతాకాలను కైవసం చేసుకున్నాడు.ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన జ్వలిత్ నల్గొండ ఎమ్మెల్యే చేతులమీదుగా బహుమతులు అందుకున్నాడు.

టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం చేసుకోడం ఉమ్మడిఖమ్మం జిల్లాలో మొదటిసారని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్,డీవైఎస్‌ఓ ఎం.పరంథామరెడ్డి,టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి మరియు కోచ్ ఓలేటి సాంబమూర్తి తదితరులు అభినందించారు.ఏజెన్సీ మండలం చర్ల పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన జల్విత్‌ను,వారి కుటుంబ సభ్యులను మేమున్నాం సహాయ సమితి చైర్మన్ నీలి ప్రకాష్ ప్రత్యేకంగా అభినందించారు.రాబోయే జాతీయస్థాయిలో పోటిల్లో రాణించి,మరెన్నో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News