- Advertisement -
బ్యాంకాక్: థాయిలాండ్ వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే 100 మీటర్ల హార్డిల్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో జ్యోతి 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఛాంపియన్‌గా అవతరించింది. విశాఖకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో అసాధారణ ఆటతో అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణం సాధించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. మరోవైపు చారిత్రక ప్రదర్శనతో అలరించిన జ్యోతిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
- Advertisement -